దాదాపు నెల రోజుల నుంచి చికిత్స పొందుతూ వచ్చిన జేమ్స్.. ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. తన డాక్టర్లు, హైడ్రాక్సీక్లోరోక్విన్ వల్లే తాను కరోనాను జయించానని జేమ్స్ నొక్కి చెప్తున్నాడు. మంచి డాక్టర్లు ఉంటే కరోనా నుంచి సులభంగా బయటపడవచ్చని, ఏ ఒక్కరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేమ్స్ భరోసా ఇచ్చాడు. జేమ్స్ వ్యాఖ్యలతో హైడ్రాక్సీక్లోరోక్విన్ నిజంగా కరోనా నుంచి విముక్తి కలిగిస్తుందా అనే చర్చ ప్రారంభమైంది.
మార్చి ఏడో తేదీన తన భార్యతో కలిసి సినిమాకు వెళ్లానని.. అదే రోజు రాత్రి ఒక్కసారిగా దగ్గ, ఒళ్లు నొప్పులు మొదలైనట్టు జేమ్స్ పేర్కొన్నాడు. వెంటనే పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలినట్టు తెలిపాడు. 17 రోజుల పాటు తనను ఐసీయూలోనే ఉంచారని, తాను మరణిస్తానేమోనన్న భయం కూడా వేసిందన్నాడు. అయితే ఒకరోజు డాక్టర్లు తనకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇచ్చారని.. కొద్ది గంటల తర్వాత ఆరోగ్యం కొంచెం కుదుటపడినట్టు అనిపించిందన్నాడు.