భారత ప్రభుత్వం మరోసారి పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని యోచిస్తోందని, దానికి సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందని ఖురేషి అన్నారు. అయితే ఈసారి భారత్ అలాంటి దాడులకు పాల్పడితే తిప్పికొట్టడానికి పాక్ సిద్ధంగా ఉందన్నారు.
భారత్ దాడులు చేస్తుంటే తామేమీ చేతులు కట్టుకుని కూర్చోబోమన్నారు. తమ దేశానికీ ఆయుధ సంపత్తి ఉందని, ఈ విషయాన్ని భారత్ గుర్తుంచుకోవాలని అన్నారు. కాగా, పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.