'అంతర్జాతీయ, స్థానిక చట్టాలు, నిబంధనలకు లోబడే పనిచేయాలని మా దేశ వాణిజ్య, వర్తక సంస్థలకు చైనా ప్రభుత్వం ఎల్లప్పుడూ చెబుతుంది. చైనా పెట్టుబడిదారులతో పాటు అంతర్జాతీయ పెట్టుబడిదారుల హక్కులను కాపాడే బాధ్యత భారత ప్రభుత్వానికి ఉంది' అని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు, చైనా యాప్‌లపై భారత్ నిషేధం విధించిన నేపథ్యంలో... చైనా కూడా ఘాటుగానే ప్రతిస్పందించింది. చైనాలో భారత వెబ్ సైట్లు చూసేందుకు వీల్లేకుండా అక్కడి ప్రభుత్వం వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) సర్వర్ల వ్యవస్థను నిలిపివేసింది.
చైనాలో వార్తా ప్రసారాలపైనా, ప్రసార సంస్థలపైనా విపరీతమైన సెన్సార్ ఉంటుంది. వీపీఎన్ వంటి నెట్వర్కింగ్ టూల్స్ లేకుండా వెబ్ సైట్లు వీక్షించడం కుదరనిపని. అందుకే చైనా తనకు అభ్యంతరకరం అని భావించిన వెబ్ సైట్లను, టీవీ చానళ్లను ఇంటర్నెట్లో చూసేందుకు వీల్లేకుండా వీపీఎన్‌ను నిలువరించే సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించింది. ఈ టెక్నాలజీ పనితీరు చూస్తే అద్భుతం అనకుండా ఉండలేరు.