వీడెవడ్రా బాబూ... ఇంత జరుగుతున్నా హాయిగా కూర్చుని చిప్స్ తింటున్నాడు.. (Video)

సోమవారం, 13 జనవరి 2020 (15:51 IST)
ఇంగ్లండ్‌కు చెందిన ఓ ప్రముఖ రెస్టారెంట్లో కస్టమర్లకు, షాపు నిర్వాహకులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌లోని ప్రముఖ రెస్టారెంట్ కెన్స్‌ కబాబ్‌లో ఓ కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఈ క్రమంలో షాపులో పనిచేసే వ్యక్తులతో కస్టమర్‌కు గొడవ జరిగింది. వాగులాట కొట్లాట వరకు వెళ్లింది. ఒకరిపై ఒకరు దాడికి కూడా పాల్పడ్డారు. 
 
దీన్ని గమనించిన కస్టమర్లు, షాపులో పనిచేసే ఇతర ఉద్యోగులు షాపు నుంచి పారిపోయారు. కొందరు ఘర్షణను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఇంత జరుగుతున్నా.. ఓ వ్యక్తి మాత్రం హాయిగా కూర్చుని.. ఆ ఘర్షణను సినిమా చూస్తున్నట్లు చూస్తూ.. చిప్స్ తింటూ గడిపాడు. 
 
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఘర్షణకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్లు హాయిగా చిప్స్ తింటున్న వ్యక్తిపై కామెంట్లు, మీమ్స్ పేలుతున్నాయి. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.

Wow fight In kens kebab pic.twitter.com/WcvGgE2kqY

— Beth Deakin✨ (@xbethdeakin) January 11, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు