మహిళ అండర్‌వేర్‌ను మాస్కుగా ధరించాడు.. ఎందుకో తెలుసా?

శనివారం, 18 డిశెంబరు 2021 (09:57 IST)
mask
మహిళ అండర్‌వేర్‌ను మాస్కుగా ధరించాడు ఓ విమాన ప్రయాణీకుడు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఫోర్ట్ లౌడెర్‌‌డేల్ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. బోర్డింగ్ పాస్, కరోనా లేనట్టుగా ధ్రువీకరణ పత్రం చూసి ప్రయాణికులను విమానంలోకి అనుమతించారు. 
 
విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఆడమ్ జేన్ (38) అనే వ్యక్తి మహిళ అండర్‌వేర్‌ను మాస్కుగా ధరించడాన్ని చూసిన విమాన సిబ్బంది షాకయ్యారు. దాన్ని తొలగించి సాధారణ మాస్కు ధరించాలని కోరారు. కానీ అతడు అందుకు నిరాకరించాడు. దీంతో అతడిని విమానం నుంచి దించేశారు. 
 
అంతేకాదు, మాస్కు నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను అతడిపై నిషేధం విధిస్తున్నట్టు విమానయాన సంస్థ పేర్కొంది. దీనిపై ఆడమ్ జేన్ మాట్లాడుతూ.. విమానంలో తినేటప్పుడు, తాగేటప్పుడు కూడా మాస్కు ధరించాలని చెబుతున్నారని, అందుకు నిరసనగానే తాను ఈ పని చేసినట్టు చెప్పాడు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు