తాను దేశం విడిచి పారిపోలేదని, రష్యా సైన్యం తనను రక్షించిందని సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ తెలిపారు. సిరియా దేశాన్ని తిరుగుబాటుదారులు ఆక్రమించుకున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో దేశాధ్యక్షుడు అసద్ దేశం విడిచిపారిపోయారంటూ ప్రచారం జరిగింది. ప్రస్తుతం రష్యాలో ఆశ్రయం పొందుతున్న అసద్ తన ఎక్స్ వేదికగా స్పందించారు.
సిరియా రాజధాని డమాస్కస్‌ను తిరుగుబాటు దళాలు ఆక్రమించుకున్న క్రమంలో తాను దేశాన్ని వీడి వెళ్లిపోవాలని అనుకోలేదని అసద్ పేర్కొన్నారు. రష్యా బేస్ నుంచే పోరాటం చేయాలనుకున్నానని తెలిపారు. అయితే, ఆ సైనిక స్థావరంపై డ్రోన్ల దాడులు జరగడంతో రష్యా సైన్యం తనను సురక్షిత ప్రాంతానికి తరలించిందని తెలిపారు.