మయన్మార్‌లో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంటోంది. సైనిక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజలు ఆయుధాలు చేతబట్టుకుని సైనికులపై తిరగబడుతున్నారు. తాజాగా రాజధాని నెపిడాకు సుమారు 300 కి.మీ. దూరంలోని డెపాయిన్ టౌన్‌లో శుక్రవారం సైనికులు, స్థానికులకు మధ్య జరిగిన ఘర్శణలో 25మంది మరణించారు. మరి కొందరు గాయపడ్డారు.
సాయుధులైన టెర్రరిస్టులు అక్కడ గస్తీ తిరుగుతున్న సైనికులపై ఒక్కసారిగా దాడి చేశారని, ఈ ఘటనలో ఒక సైనికుడు మరణించగా ఆరుగురు గాయపడ్డారని ప్రభుత్వ ఆధీనంలోని గ్లోబల్ న్యూ లైట్ ఆఫ్ మయన్మార్ పత్రిక తెలిపింది.