నగ్నంగా స్కైడైవింగ్.. బర్త్ డేను ఇలా కూడా.. (వీడియో)

బుధవారం, 30 ఆగస్టు 2017 (15:09 IST)
పుట్టినరోజును విభిన్నంగా జరుపుకోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. వివాహాలు ఓడలు, విమానాల్లో జరిగినట్లే.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ వయొలిన్ కళాకారుడు గ్లెన్ డొన్నెల్లీ తన 30వ పుట్టిన రోజును విమానం నుంచి నగ్నంగా స్కై డైవింగ్ చేస్తూ సెలెబ్రేట్ చేసుకున్నాడు.

గ్లెన్ డొనెల్లీ తన 30వ పుట్టిన రోజు సందర్భంగా నగ్నంగా వయొలిన్‌తో స్కై డైవింగ్ చేశాడు. పురుషుల ఆహార్యంపై అవగాహన కల్పించే దిశగా ఈ స్కైడైవ్‌ను చేశాడు.
 
స్కై డైవ్ చేస్తూ వయొలిన్ వాయించాడు. అలా ఆకాశంలోనే వయొలిన్ వాయిస్తూ కిందకు దిగాడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు