కొత్తగా పెళ్లైన దంపతులు హనీమూన్ కోసం దుబాయికి వెళ్లారు. ఈ దంపతులను పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి (28) రహస్యంగా వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేసిన ఘటన దుబాయిలో కలకలం రేపింది. నాలుగు రోజుల హనీమూన్ కోసం వెళ్లిన భారత జంట దుబాయిలో కారులో నగరమంతా షికార్లు కొట్టారు. వారు సన్నిహితంగా ఉన్న సమయంలో కారు డ్రైవర్ ఫోన్‌లో రహస్యంగా వీడియో తీశాడు. అనంతరం ఆ జంట కారు దిగి వెళ్లిపోయిన తర్వాత ఆ డ్రైవర్ వాట్సాప్ ద్వారా వీడియోను ఆ జంటలోని పురుషునికి పంపి 2000 దిర్హామ్‌లు (సుమారు రూ.36,500) ఇవ్వాలని డిమాండ్ చేశాడు.