చలికాలంలో అన్ని వయస్కుల వారు దాహం తక్కువగా అనిపించినప్పటికీ, శీతాకాలంలో నీరు తక్కువగా ఉండటం చాలా అవసరం. నిర్జలీకరణం చర్మం, శక్తిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చిన్నారులకు నీరు అప్పుడప్పుడూ తాగించడం మంచిది. అది కూడా వేడి నీళ్లను కాస్త గోరు వెచ్చగా ఇవ్వడం మంచిది.
అలాగే మహిళలూ, చలికాలంలో నీటిని తీసుకోవడం మరిచిపోకూడదు. హెర్బల్ టీల వంటి వెచ్చని పానీయాలను ఎంచుకోవచ్చు. వీటితో పాటు నారింజ, దోసకాయలు, క్యారెట్ వంటి వేరు కూరగాయలు వంటి హైడ్రేటింగ్ ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి. తద్వారా చర్మం పొడిబారకుండా నిరోధించవచ్చు.
ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ, శరీరం బాగా పనిచేయడానికి ఇంకా తగినంత నీరు అవసరం. వెచ్చని పానీయాలు అల్లం లేదా, మిరియాలతో చేసిన హెర్బల్ టీలు తీసుకోవచ్చు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియకు సహాయపడతాయి.
హైడ్రేటింగ్ ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి. ఇందుకోసం నారింజ, ఆపిల్, దోసకాయలు వంటి నీరు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. శీతాకాలపు రుచి కోసం, క్యారెట్లు, చిలగడదుంపలు, బీట్‌రూట్ వంటి రూట్స్ కలిగిన కూరగాయలను సూప్‌లలో చేర్చుకోవచ్చు. ఎక్కడికి వెళ్లినా నీటి బాటిల్ పక్కనే వుండేలా చూసుకోండి. రోజుకు రెండు లేదా మూడు కప్పుల కాఫీ, టీ వంటివి తీసుకోవచ్చు.