విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి, రికార్డ్ బ్రేకింగ్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో పొంగల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ బాక్సాఫీస్ వివరాలను తెలియజేసింది.
వెంకటేష్ గారు.. 'సంక్రాంతికి వస్తున్నాం' సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ?
-వండర్ ఫుల్ హ్యాపీ ఫీలింగ్. సంక్రాంతికి హానెస్ట్ గా ఓ ఫ్యామిలీ సినిమా ఇవ్వాలని అనుకున్నాం. కానీ ఆడియన్స్ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు. చాలా సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. హిట్ కాదు.. ట్రిపుల్ బ్లాక్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఈ సినిమాకి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ.
-సినిమాకి కాస్త దూరమైన ప్రేక్షకులు సినిమాకి రావడం ఆనందంగా వుంది. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ గారు ముఫ్ఫై ఏళ్ళుగా థియేటర్ కి వెళ్ళలేదు. మొన్న ఈ సినిమా చూశారు. ఇది చాలా ఎమోషల్ గా అనిపించింది. మామూలు సినీ గోయర్స్ తో పాటు సినిమాకి దూరమైన ఓ రెండు శాతం ఆడియన్స్ కూడా వచ్చి చూడటం జరిగింది. అందుకే ఈ టెర్రిఫిక్ రెవెన్యూస్ అనుకుంటున్నాను. ఇది టెన్త్ డే. చాలా స్ట్రాంగ్ గా ఆడుతోంది. ఇంకా చూడని వారు, మళ్ళీ చూడాలనుకునే వారు ఈ వారం కూడా మంచి రెవెన్యూ ఇస్తారని ఆశిస్తునాను. ఈ సక్సెస్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఫ్యామిలీ సినిమాలకి వున్న స్ట్రెంత్ ని ఈ సినిమా మరోసారి నిరూపించింది.
అనిల్ గారు ఈ సినిమా విజయంలో భీమ్స్ మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది.. నెక్స్ట్ ఆయనతో జర్నీ ఎలా వుంటుంది ?
-భీమ్స్ లో నాకు నచ్చే క్యాలిటీ దర్శకుడి కావాల్సిన మ్యూజిక్ ఇవ్వడం. ఈ పొంగల్ తో భీమ్స్ టైం మొదలైయింది. నెక్స్ట్ పదేళ్ళు తనదే. తనతో నా జర్నీ వుంటుంది.
వెంకటేష్ గారు..ఈ జర్నీలో అనిల్ గారిలో ఎలాంటి మార్పులు గమనించారు ?
-నేను తొలిసారి కలిసినప్పుడు అనిల్ ఓ రైటర్. తనలో అప్పుడే ఒక స్పార్క్ కనిపించింది. మా మధ్య మంచి రేపో వుంది. తనతో ఎప్పుడూ ఓ ఫ్రెండ్ లానే వుంటాను. మేము చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాం, అందుకే రిజల్ట్ ఇంత పాజిటివ్ గా వుంటుంది. తను చాలా ఎనర్జిటిక్ గా వుంటారు.
భీమ్స్ గారు.. అనిల్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-అనిల్ గారు ఓ లైబ్రెరీ. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. చాలా చిన్న చిన్న పదాలని ఎంత అందంగా పట్టుకోవచ్చో తెలుసుకున్నాను.
-సంక్రాంతికి వస్తున్నాం ఓ అమ్మలాంటి జ్ఞాపకం. ఈ సినిమాతో ప్రతి గడపకు వెళ్ళగలిగాను. వెంకటేష్ గారి కలిసుందాం రా పాటలని ప్రేక్షకులు ఎంత గుండెల్లో పెట్టుకున్నారో ఈ సినిమా పాటలని కూడా అదే స్థాయిలో ఆస్వాదించారు. ప్రేక్షకుల ప్రేమకు ధన్యవాదాలు.
వెంకటేష్ గారు.. ఐశ్వర్య రాజేష్ మీ కాంబినేషన్ లో సౌందర్య గారిని గుర్తు చేశారనే కాంప్లిమెంట్స్ వచ్చాయి.. మీకు ఎలా అనిపించిందా ?
-ఐశ్వర్య అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. తనకి మంచి రోల్ దొరికింది. తను చాలా అనుభవం వున్న నటి. ఈ జోనర్ చేయడం తనకి కొత్త. అనిల్ చాలా చక్కని పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు.
అనిల్ గారు.. బుల్లి రాజు పాత్ర వైరల్ కావడం ఎలా అనిపించింది ?
-ఆ పాత్రని అందరూ చాలా పాజిటివ్ గా తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్ లో ఇంకొన్ని సీన్స్ వుంటే బావుండేదని అంటున్నారు. దీనికి కొనసాగింపుగా కథ చెప్పినప్పుడు తన పాత్ర చుట్టూ మరింత వినోదం వుండేలా డిజైన్ చేస్తాను.