భారత్కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ప్రచారాన్ని తీవ్రతరం చేయనుంది. 1960 ఇండస్ వాటర్స్ ట్రీటీకి సంబంధించి భారత్కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ప్రచారాన్ని తీవ్రతరం చేయనుంది. జమ్మూకాశ్మీర్లోని రెండు హైడ్రో పవర్ ప్రాజెక్టులను పాకిస్థాన్ అధికారులు సందర్శించేందుకు భారత్ అనుమతించకపోవడంతో పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకుంది.
జమ్ముకాశ్మీర్లోని పాకల్ దూల్, లోయర్ కల్నాయ్ ప్రాజెక్టుల సందర్శనకు అనుమతిస్తామని ఆగస్టు 29, 30 తేదీలలో జరిగిన సమావేశం సందర్భంగా ఇండియన్ వాటర్ కమిషనర్ హామీ ఇచ్చారని పాకిస్థాన్ ఇండస్ వాటర్ కమిషనర్ సయ్యద్ మెహర్ అలీషా చెప్పారు. కానీ జమ్మూకాశ్మీర్లో అక్టోబర్లో జరిగిన స్థానిక ఎన్నికల సందర్భంగా ఆ కార్యక్రమం వాయిదా పడిందన్నారు.