ట్రంప్ నిషేధించిన దేశాలన్నింటిలో ఐక్యరాజ్యసమితికి చెందిన యునిసెప్కు సంబంధించిన పనులు అనేకం జరుగుతున్నాయని, ఇప్పుడీ నిషేధం వల్ల పిల్లలు బాగా ఇబ్బందులకు గురవుతున్నారని ప్రియాంక చెప్పింది. మాజీ మిస్ వరల్డ్ అయిన ప్రియాంక యునిసెఫ్ తరపున గుడ్విల్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు.
ఇరాక్, సిరియా, ఇరాన్, సూడాన్, లిబియా, సోమాలియా, ఎమెన్ దేశాల ప్రజలను అమెరికాలోకి అడుగు పెట్టకుండా ట్రంప్ తీసుకొచ్చిన తాత్కాలిక నిషేధ ఉత్తర్వులకు వ్యతిరేకంగా అమెరికాలో, ప్రపంచ దేశాల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం, నిస్పృహ, నిస్సాహాయత, ప్రదర్శనలు, నిరసనలు వంటివన్నీ సమర్థించదగినవే అని ప్రియాంక చెప్పారు.
ట్రంప్ నిషేధపు ఉత్తర్వుకు వ్యతిరేకంగా గళమెత్తిన జెన్నిఫర్ లోపెజ్, జెన్నిఫర్ లారెన్స్, బార్బరా స్ట్రెయిశాండ్, రిహన్నా, అష్టోన్ కుచ్చెర్ వంటి హాలీవుడ్ సెలెబ్రిటీలతో ప్రియాంక కూడా ఇప్పుడు చేతులు కలిపారు.