జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై శుక్రవారం హత్యాయత్నం జరిగింది. ఆయన ఓ మీటింగ్‌లో ప్రసంగిస్తుండగా, ఆయన వెనుక నుంచి గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. నారా నగరంలో దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మాజీ ప్రధానికి గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన కార్డియోపల్మోనరీ అరెస్ట్‌లో ఉన్నట్టు వైద్యులు వెల్లడిచారు. పైగా, ఆయన్ను ఆస్పత్రికి తరలించే సమయంలోనే స్పృహలో లేకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, అబేపై వెనుక నుంచి రెండు రౌండ్ల కాల్పులు జరిగినట్టు సోషల్ మీడియాలో వార్తలు ట్రెండ్ అవుతున్నాయి.