వైరస్ నుంచి రక్షణ పొందేందుకు 40 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్ టీకా రెండో మోతాదును వేగవంతం చేస్తామన్నారు. ఇదిలావుండగా.. ఆదివారం బ్రిటన్లో కొత్తగా 7,490 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. ఎనిమిది మంది మరణించారు. వారం కిందటి కేసులతో పోలిస్తే గతవారం కేసుల్లో 49శాతం పెరుగుదల కనిపించింది.