ఉక్రెయిన్ రాజకీయ నాయకురాలు ఓల్గా ల్యూన్చాక్ నగ్న చిత్రాలు నెట్‌లో ప్రత్యక్షం కావడంతో ఆ దేశంలో ఒక్కసారి కలకలం చెలరేగింది. అయితే 30 ఏళ్ల వయస్సులో పార్లమెంట్ ఎన్నికల బరిలో దూకేందుకు సిద్ధంగా ఉన్న ఓల్గా మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. ఐక్లౌడ్ హ్యాకర్ చేసిన పాపానికి తాను బాధపడేదేమీ లేదని చెప్పేశారు. అంతటితో ఆగని ఆమె, దీనిపై తానేమీ సిగ్గు పడటం లేదని కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
అయినా ప్రముఖుల పెయింటింగ్స్‌లోని నగ్న మహిళల ఛాయాచిత్రాలకు, నెట్‌లో కనిపించిన తన చిత్రాలకు పెద్ద తేడా ఏమీ లేదని కూడా ఆమె సెలవిచ్చారు. ప్రముఖుల ఛాయాచిత్రాల్లోని నగ్నత్వాన్ని కీర్తించే జనం, మహిళలు నగ్నంగా కనిపిస్తే మాత్రం ఎందుకు ఏవగించుకుంటారో అర్థం కావడం లేదని విమర్శించారు. మహిళల నగ్నదేహాన్ని కళాత్మక రూపమని ఆమె అభివర్ణించారు.