రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పైన మిలిటరీ ఆపరేషన్ ప్రకటించిన తర్వాత ఉక్రెయిన్‌లోని కైవ్, ఖార్కివ్ ప్రాంతాలతో సహా ఇతర ప్రాంతాలలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రష్యా చర్యలో జోక్యం చేసుకునే ఏ విదేశీ ప్రయత్నమైనా వారు ఎన్నడూ చూడని పరిణామాలు చవిచూస్తారని పరోక్షంగా అమెరికాను హెచ్చరించారు పుతిన్.
తూర్పు ఉక్రెయిన్‌లోని పౌరులను రక్షించడానికి ఈ దాడి అవసరమని పుతిని చెప్పడాన్ని అమెరికా ఆక్షేపించింది. మరోవైపు అమెరికా, దాని మిత్రదేశాలు NATOలో చేరకుండా ఉక్రెయిన్‌ను నిరోధించాలని, మాస్కో భద్రతా హామీలను అందించాలని రష్యా చేసిన డిమాండ్‌ను విస్మరించాయని పుతిన్ ఆరోపించారు.