Russia Ukraine Crisis: తూర్పు ఉక్రెయిన్ పైన రష్యా బాంబుల వర్షం

గురువారం, 24 ఫిబ్రవరి 2022 (09:11 IST)
రష్యా అనుకున్నంత పని చేస్తోంది. ఉక్రెయిన్ దేశం పైన సైనిక దాడికి దిగింది. బాంబుల మోత పుట్టిస్తోంది. తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యను నిర్వహిస్తుందని వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. రష్యా చర్యలో జోక్యం చేసుకునే ఏ విదేశీ ప్రయత్నమైనా 'వారు ఎన్నడూ చూడని పరిణామాలకు' దారితీస్తుందని పుతిన్ హెచ్చరించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.
 
 
రష్యా కొన్ని గంటల్లో ఉక్రెయిన్‌పై దాడి చేస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ పుతిన్ సైనిక చర్య ప్రకటించారు. ఉక్రేనియన్ దూకుడును తిప్పికొట్టేందుకు వేర్పాటువాదులు క్రెమ్లిన్‌ను సహాయం కోరారని రష్యా ఇంతకుముందు చెప్పింది.
 
 
చాలా రోజులుగా, రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా సైనిక బలగాలు పెద్దఎత్తున మోహరించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు వేర్పాటువాద ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించి, శాంతి పరిరక్షక దళాలను మోహరించాలని ఆదేశించిన తర్వాత బుధవారం ఉక్రెయిన్ తూర్పున తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు