కరోనా పుట్టుకకు, అది ల్యాబ్ నుంచి లీక్ కావడానికి మధ్య ఎటువంటి సంబంధమూ లేదని ఎవరైనా కొట్టిపారేస్తే అది తొందరపాటే అవుతుందని వ్యాఖ్యానించారు. ఆ వైరస్ ఎక్కడ పుట్టిందన్న అంశంపై పరిశోధన కొనసాగుతోందని తెలిపారు.
తాను కూడా ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేశానని, తాను ఇమ్యునాలజిస్టును అని చెప్పారు. కొన్ని ల్యాబ్‌ల్లో ప్రమాదాలు జరుగుతుండడం సాధారణమేనని చెప్పారు. అలాగే, కరోనా మూడో దశ విజృంభణ ప్రారంభ దశలో ప్రపంచం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 100కు పైగా దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతున్నాయన్నారు.