పాకిస్థాన్‌లో పరువు హత్యలు జరగడం మామూలైపోయింది. తాజాగా ప్రేమికుడితో పారిపోయిన సోదరిని ఓ సోదరుడు పరువు హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌కు చెందిన లాహోర్ ప్రాంతానికి చెందిన ఇషాక్, నసియాలు అన్నాచెల్లెళ్లు. వీళ్లిద్దరూ చిన్నప్పటి నుంచి ప్రేమానురాగంతో మెలిగేవారని స్థానికులు చెప్తున్నారు. అయితే తన చెల్లెల్లు ప్రేమ కారణంగా ఇంటి నుంచి పారిపోవడాన్ని ఇషాక్ జీర్ణించుకోలేకపోయాడు.
నసియా అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడటం.. ఆపై అతని కోసం ఇంటి గడప దాటడాన్ని పరువుపోయినట్లు భావించిన ఇషాక్.. చెల్లెల్ని వెతికి పట్టుకున్నాడు. మంచిగా మాట్లాడి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చాక ఇంటి గౌరవాన్ని మంటగలిపావని కత్తితో పొడిచి చంపేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.