A-68 నుండి భారీ భాగం తొలగిపోవడంతో ఈ హిమానీనదం యొక్క పరిమాణం బాగా తగ్గింది. ప్రస్తుతం ఈ హిమానీనదం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి దీని ముగింపుకు ఇది ప్రారంభం కావచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలో అతి పెద్ద ఈ మంచు కొండ క్రమంగా చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి అంతరిస్తుందని వారు అంచనా వేస్తున్నారు.
హిమనీనద శాస్త్రవేత్త అడ్రియన్ లక్ మాన్ ప్రకారం... జూలై 2017లో లార్సెన్ సి ఐస్ షెల్ఫ్ నుండి విడిపోయిన తరువాత A-68 ఎదుర్కొన్న రెండవ అతిపెద్ద సంఘటన ఇది. అతను గత మూడు సంవత్సరాలుగా ఈ మంచు కొండ యొక్క పురోగతిని అనుసరిస్తున్నాడు. అలాగే దీని యొక్క తుది విచ్ఛిన్నం ప్రారంభమైందని కూడా ఆయన పేర్కొన్నాడు. ఏదేమైనా ఈ మంచు కొండలో తరువాతి భాగాలు నాశనం కావడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చని లక్ మాన్ చెబుతున్నారు.
వెడ్డెల్ సముద్రంలోని లార్సెన్ సి ఐస్ షెల్ఫ్ నుండి మంచు కొండ విరిగిపోయినప్పటి నుండి దీనికి 'A' హోదా లభించింది. అలాగే 68 అనేది ఈ మంచు కొండ శ్రేణిలో తాజా సంఖ్య. A-68 చాలా సన్నగా ఉండడం వలన అంటార్కిటికా యొక్క ఉత్తరాన పెరుగుతున్న వెచ్చని ఉష్ణోగ్రతలు, బలమైన ప్రవాహాలకు ఇది క్రమంగా అంతరించిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.