జట్టు ల్యాప్ టాప్‌ను పగలగొట్టిన శిఖర్ ధావన్.. కళ్లురిమిన వీవీఎస్ లక్ష్మణ్

డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ సొంత జట్టు ల్యాప్‌టాప్‌ను పగులగొట్టాడు. దీంతో జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ కళ్లరుముతూ .. ఎంత పని చేశావంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే, సీరియస్‌గా మాత్రం కాదు. ఈ ఆసక్తికర సంఘటను పరిశీలిస్తే... 
 
శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ జరుగుతున్న వేళ హైదరాబాద్ జట్టు బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ కొట్టిన ఓ షాట్‌కు జట్టు కీలక ప్రణాళికలు, వీడియోలు ఉన్న అత్యాధునిక సోనీ ల్యాప్ టాప్ పగిలిపోయింది. ట్రెంట్ బౌల్డ్ వేసిన రెండో ఓవర్ మొదటి బంతిని శిఖర్ ధావన్, బౌండరీ లైన్‌ను దాటించగా, అది అనలిస్ట్ శ్రీనివాస్ ముందున్న ల్యాప్ టాప్ వెనుక భాగాన్ని బలంగా తాకింది. 
 
దీంతో ల్యాప్‌టాప్ స్క్రీన్ పగిలిపోగా, అది స్విచ్చాఫ్ అయింది. ఈ ఘటనను అత్యంత దగ్గరి నుంచి చూసిన సన్‌రైజర్స్ జట్టు మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్, ఎంత పనిచేశావు? అన్నట్టు ధావన్ వైపు ఓ లుక్కేసి, 'ఎలా చేశాడో చూడండి' అన్నట్టు కోచ్ టామ్ మూడీ, మరో బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్‌లకు ల్యాప్‌టాప్‌ను చూపాడు. 

వెబ్దునియా పై చదవండి