చిన్నస్వామి స్టేడియంలో ఆడేటప్పుడు అభిమానుల మద్దతు ఎంతో ఉంటుందని, అభిమానుల కోలాహలంతో కొన్నిసార్లు బంతి ఎక్కడ వేస్తున్నానో అని అర్థం కాదని అన్నాడు. కోహ్లీ గురించి మాట్లాడుతూ.. జట్టు కెప్టెన్ వెన్నంటే ఉంటే ఏ ఆటగాడైనా మంచి ప్రదర్శనను ఇవ్వగలడని పేర్కొన్నాడు. టీమ్ యాజమాన్యం కూడా తెర వెనకాల ఉండి అన్నివిధాలుగా సహకరిస్తుందని అన్నాడు.