ఐపీఎల్-2020.. ఆర్సీబీ లోగోపై విజయ్ మాల్యా కామెంట్స్.. కోహ్లీని?

ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (11:51 IST)
ఐపీఎల్-2020 సీజన్‌కు సరికొత్త లోగో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు బరిలోకి దిగనుంది. కొత్త దశాబ్దం.. కొత్త లొగోతో ఐపీఎల్‌లో బరిలోకి దిగబోతున్నట్లు ఆర్సీబీ యాజమాన్యం ప్రకటించింది. అంతేకాదు టీమ్ సోషల్ మీడియా అకౌంట్స్‌లోనూ ప్రొఫైల్ ఫొటోల్ని మార్చింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు కొత్త లోగోను ఆవిష్కరించి అందరినీ ఆకట్టుకుంది. లోగో ఆవిష్కరణ వీడియోను ట్వీట్‌ చేస్తూ కొత్త శతాబ్దం.. కొత్త ఆర్సీబీ.. కొత్త అధ్యాయం అని పోస్ట్‌ చేసింది. 
 
ఇది చూసిన విజయ్‌మాల్యా గొప్పగా ఉందంటూనే.. ట్రోఫీ గెలవండని సెటైర్‌ వేశాడు. ఆర్సీబీ పోస్టు చేసిన మరో ట్వీట్‌ను మాల్యా రీట్వీట్‌ చేశాడు. అందులో ఆ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తాడు.
 
అండర్‌-19 జట్టు నుంచే విరాట్‌ కోహ్లీ ఆర్సీబీలోకి వచ్చాడని చెప్పుకొచ్చాడు. అతడు టీమ్‌ఇండియాకు అత్యుత్తమ విజయాలు అందించి జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడని ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం కోహ్లీని స్వేచ్ఛగా వదిలేయాలని ఆర్సీబీకి సూచించాడు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభిమానులందరికీ ట్రోఫీ కావాలని విజయ్ మాల్యా వ్యాఖ్యానించాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు