ధోనీ... సాహస వీరుడా? ఐపీఎల్ అవకాశాన్ని వద్దన్న మిస్టర్ కూల్!!

బుధవారం, 9 సెప్టెంబరు 2020 (08:52 IST)
'మిస్టర్ కూల్‌'గా తన పనిని తాను చేసుకునిపోయే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోమారు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ యాజమాన్యం ఇచ్చిన ఓ అవకాశాన్ని ఆయన వద్దని చెప్పేసారు. పైగా, తమ జట్టు తొలి మ్యాచ్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాడు. 
 
నిజానికి ధోనీ తీసుకున్న నిర్ణయంతో ఐపీఎల్ నిర్వాహకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకంటే... ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఏ కెప్టెన్ తీసుకోని నిర్ణ‌యాన్ని ధోనీ తీసుకోవడమే కారణం. జ‌ట్టులో ఆట‌గాళ్ల‌తో స‌హా సిబ్బందికి క‌రోనా సోక‌డంతో 19వ తేదీన ముంబైతో ప్రారంభ మ్యాచ్ ఆడ‌టానికి బ‌దులు 23న త‌మ మొద‌టి మ్యాచ్ ఆడే అవ‌కాశాన్ని ఐపీఎల్ క‌ల్పించింది. కానీ ధోనీ మాత్రం త‌మ జ‌ట్టు 19నే బ‌రిలోకి దిగుతుంద‌ని తెలిపాడ‌ట‌. 
 
ఐపీఎల్ షురూ అయిన త‌ర్వాత 5వ రోజు సీఎస్‌కే త‌మ మొద‌టి మ్యాచ్ ఆడ‌వ‌చ్చున‌ని ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ ధోనీ సేన‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్లు తెలిపారు. దీనివ‌ల్ల జ‌ట్టును సిద్ధం చేసుకోవ‌డానికి మ‌రింత స‌మ‌యం వారికి కల్పించిన‌ట్లు ఉంటుంద‌ని బ్రిజేశ్ పేర్కొన్నారు. కానీ సీఎస్‌కే కెప్టెన్ ధోనీ ఈ ప్రతిపాదనను తిరస్కరించాడు. 
 
ముంబై ఇండియన్స్‌తో ప్రారంభ మ్యాచ్ ఆడ‌టానికి జ‌ట్టును సిద్ధం చేస్తున్నామ‌ని ధోని తెలిపాడ‌ట‌. సెప్టెంబర్ 19న తొలి ఆట ప్రారంభమయ్యే నాటికి సమస్యలన్నింటినీ అధిగమిస్తామ‌ని ధోనీ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడ‌ట. దీంతో సీఎస్‌కే ఐపీఎల్ ప్రారంభ‌మైన ఆరు రోజుల్లో మూడు మ్యాచ్‌లు ఆడే ఏకైక జ‌ట్టుగా నిలువ‌నుంది. 
 
కాగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుల వివరాలను పరిశీలిస్తే, ధోనీ, అంబటి రాయుడు, షేన్ వాట్సన్, డుప్లెసిస్, మురళీ విజయ్ కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, రితురాజ్ గ్వైకాడ్, బ్రావో, కర్న్ శర్మ, ఇమ్రాన్ తాహీర్, మిచెల్ సత్నర్, సార్దూల్ ఠాకూర్, ఏఎం అసిఫ్, దీపక్ చార్, ఎన్. జగదీశన్, లుంగ నిడి, మనుసింగ్, శ్యామ్ కరణ్, పియూష్ చావ్లా, జోష్ హాజెల్‌వుడ్, సాయ్ కిషోర్‌లు ఉన్నారు. వీరితో పాటు.. సురేష్ రైనా, హర్భజన్ సింగ్‌లు ఉన్నప్పటికీ.. తమతమ వ్యక్తిగత కారణాల రీత్యా ఈ టోర్నీకి వారు దూరంగా ఉండనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు