ఐపీఎల్ 2021లో మార్పులు.. ఏంటవో తెలుసా?

సోమవారం, 29 మార్చి 2021 (20:59 IST)
ఐపీఎల్ 2021లో మ్యాచ్ రూల్స్‌లో బీసీసీఐ కీలక మార్పులు చేసింది. మ్యాచ్ టై అయితే ఫలితం తేలే వరకూ సూపర్ ఓవర్లు ఆడించే రూల్‌లో కూడా బోర్డు మార్పులు చేసింది. కొత్త రూల్ ప్రకారం మ్యాచ్ ముగిసిన తర్వాత ఒక గంటలోపు మాత్రమే సూపర్ ఓవర్లు ఆడించాలని నిర్ణయించింది.

అప్పటికే ఫలితం తేలకపోతే మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించి చెరొక పాయింట్ ఇస్తారు. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ రెండు సూపర్ ఓవర్లకు దారి తీసిన సంగతి తెలిసిందే.
 
ఇకపోతే.. సాఫ్ట్ సిగ్నల్‌ను రద్దు చేసిన బోర్డు.. షార్ట్‌ రన్‌ను తేల్చే పనిని థర్డ్ అంపైర్‌కు అప్పజెప్పింది. అయితే గత సీజన్‌లో షార్ట్ రన్ విషయంలో అంపైర్ నితిన్ మీనన్ చేసిన తప్పిదం కారణంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అలియాస్ పంజాబ్ కింగ్స్ భారీగా నష్టపోయింది. అలాగే, ఆన్‌ఫీల్డ్ అంపైర్లు ప్రకటించే నో బాల్స్‌పై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని సైతం థర్డ్ అంపైర్‌కు కట్టబెట్టింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు