పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. మొహాలీలో భారీ వర్షం కురవడంతో.. ఎంతకీ తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం పంజాబ్ 7 పరుగుల తేడాతో గెలిచినట్టు ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 191 పరుగులు సాధించింది.