మరో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టిన ఎయిర్‌టెల్

మంగళవారం, 16 ఆగస్టు 2022 (14:56 IST)
ప్రైవేట్ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ మరో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని రిలయన్స్ జియో పలు కొత్త ప్లాన్లతో ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. అయితే, జియోకు ప్రధాన పోటీదారుడుగా ఉన్న ఎయిర్‌టెల్ ఒక రోజు ఆలస్యంగా ఈ కొత్త ప్లాన్లను తెచ్చింది. 
 
ఇందులో రూ.519, రూ.779 ప్లాన్లు ఉన్నాయి. ముఖ్యంగా, రూ.519 ప్లానులో 60 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1.5జీబీ డేటా చొప్పున 90 జీబీ డేటాను వాడుకోవచ్చు. అలాగే, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. వీటితో పాటు పలు ఉచిత ప్రయోజనాలు కూడా పొందవచ్చు. 
 
అదేవిధంగా రూ.779 ప్లాన్‌లో 90 రోజుల వ్యాలిడిటీతో పాటు 1.5 జీబీ డేటాతో మొత్తం 135 జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. రోజుకూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా పంపుకునే వెసులుబాటు వుంది. కాగా, ఈ కంపెనీ ఇప్పటికే రూ.299, రూ.479, రూ.299 ప్లాన్లతో 28 రోజుల వ్యాలిడిటీతో ఉచిత కాలింగ్, ఎస్ఎంఎస్ సదుపాయాలు లభిస్తాయి. రూ.479 ప్లాన్ వ్యాలిడిటీ రూ.56 రోజులుగా ఉన్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు