సరికొత్త చరిత్రను లిఖించిన ఇస్రో... నింగిలోకి దూసుకెళ్లిన చిన్నోడు

ఆదివారం, 7 ఆగస్టు 2022 (10:14 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సరికొత్త చరిత్రను లిఖించింది. అతి తక్కువ ఖర్చుతో రూపొందించిన ఉపగ్రహ వాహక నౌక ఎల్ఎస్‌ఎల్వీ డీ1 రాకెట్‌ను ఆదివారం ఉదయం నింగిలోకి ప్రయోగించింది. 
 
ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ సెంటర్‌, మొదటి లాంచ్ పాడ్ నుంచి ఈ రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. 
 
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేళ చేపట్టిన ఈ రాకెట్ ప్రయోగంతో ఆజాదీ శాట్‌తో పాటు ఈఓఎస్-02 ఉపగ్రహాలను తక్కువ ఎత్తులోని సమీప భూకక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నాయి. ఇవి మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ అనుసంధానాన్ని ఉపయుక్తం కానున్నాయి.
 
కాగా, ఇస్రో ఇప్పటివరకు పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ వాహక నౌకలను మాత్రమే అంతరిక్ష పరిశోధనలకు వినియోగిస్తూ వచ్చింది. తాజాగా అతి తక్కువ ఖర్చులో తయారుచేసిన ఎస్ఎస్ఎల్వీ-డీ1 రాకెట్‌ను రూపొందించింది. దీనికి చిన్నోడు అని పేరు పిలుస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు