ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజం అమేజాన్ సంస్థ సరికొత్త విప్లవానికి నాందిపలింది. తమ కస్టమర్లు బుక్ చేసుకున్న వస్తువులను డ్రోన్‌ల ద్వారా డెలివరీ చేస్తామని ఇటీవల ప్రకటించింది. ఆ ప్రకారంగానే డ్రోన్ ద్వారా తొలి డెలివరీ చేరవేసింది. కేంబ్రిడ్జ్‌లోని ఒక వ్యక్తి ఆర్డర్ చేసిన పాప్‌కార్న్ ప్యాకెట్‌ను డ్రోన్ ద్వారా విజయవంతంగా డెలివరీ చేయగలిగామని ఆమెజాన్ సిబ్బంది తెలిపారు.
డ్రోన్‌కు వస్తువును అటాచ్ చేయడం నుంచి డెలివరీ చేసే వరకూ వీడియో తీసిన అమెజాన్ దాన్ని విడుదల చేసింది. 00 అడుగుల ఎత్తులో ఎగురుతూ వెళ్లిన ఈ డ్రోన్ 13 నిమిషాల్లో వినియోగదారునికి ఆర్డర్ చేసిన వస్తువులను అందించింది. డిసెంబరు ఏడు నుంచి డ్రోన్‌ల ద్వారా డెలివరీ చేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టామని ఐదు పౌండ్ల బరువు వరకు ఉండే వస్తువులను 30 నిమిషాల్లోపే డెలివరీ చేయాలని నిర్ణయించుకున్నామని వారు వివరించారు. కాగా, ఈ డ్రోన్‌కు అమేజాన్ ప్రీమీ ఎయిర్ అనే పేరు పెట్టారు.