ట్రూకాలర్‌కు పోటీగా గూగుల్ కాల్ యాప్.. కాలర్ పేరు, నెంబర్ వినొచ్చు..

సోమవారం, 23 నవంబరు 2020 (21:29 IST)
ట్రూకాలర్‌కు పోటీగా గూగుల్ కాల్ యాప్ వచ్చేస్తోంది. ట్రూకాలర్ థర్డ్ పార్టీ కావడంతో యూజర్స్ డేటాపై అప్పుడప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఇలాంటి అనుమానాలకు చెక్ పెడుతూ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్ ట్రూకాలర్‌ తరహా ఫీచర్స్‌తో తన ఫోన్‌ యాప్‌లో మార్పులు చేస్తుందట. త్వరలోనే ఈ యాప్‌ని యూజర్స్‌కి అందుబాటులో తీసురానున్నట్లు టెక్‌ వర్గాలు తెలిపాయి. 
 
ఇప్పటి వరకు గూగుల్ పిక్సెల్ ఫోన్ యూజర్స్‌కి మాత్రమే పరిమితమైన ఫోన్ యాప్‌ని ఇటీవల అన్ని రకాల ఫోన్ యూజర్స్‌కి ఉపయోగించొచ్చని గూగుల్ ప్రకటించింది. అలానే యాప్‌లో కొత్తగా కాలర్ ఐడీ ఫీచర్‌ను జోడించారు. దాంతో కాల్ వచ్చినప్పుడు కాలర్ పేరు, ఫోన్ నంబర్‌ చదివి వినిపిస్తుంది. దాంతో పాటు 30 రోజుల తర్వాత పాత కాల్ స్క్రీన్‌ రికార్డింగ్‌లు వాటంతటవే డిలీట్ అయ్యే ఫీచర్‌ను కూడా తీసుకొచ్చారు. 
 
తాజాగా ఫోన్ యాప్‌ పేరు మార్చి కొత్త ఫీచర్స్‌తో కాల్ యాప్‌తో యూజర్స్‌కి మరిన్ని మెరుగైన సేవలు అందించాలని గూగుల్ భావిస్తోంది. ఫోన్‌ అనే పేరు కాకుండా గూగుల్ కాల్ పేరుతో తీసుకొస్తున్న ఈ యాప్‌లో ఫోన్ చేసే వ్యక్తి పేరు తెలుస్తుంది. అంతేకాకుండా స్పామ్‌ కాల్స్‌ని నిరోధించవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు