మోటోరోలా నుంచి మోటో జీ9 సిరీస్‌.. ధర రూ.31వేలు

శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (14:01 IST)
Moto G9 Plus
ప్రముఖ స్మార్ట్ ఫోన్ మోటోరోలా తాజాగా మోటో జీ9 సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను ఆవిష్కరించింది. మోటో వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోటో జీ9 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. మోటో జీ9 సిరీస్‌లో మోటో జీ9, మోటో జీ9 ప్లే తర్వాత విడుదలైన అతిపెద్ద ఫోన్‌ ఇదే. జీ9 ప్లస్‌ను మొదట బ్రెజిల్‌లో విడుదల చేసింది.
 
త్వరలోనే భారత్‌తో పాటు మిగతా దేశాల్లోనే రిలీజ్‌ చేసేందుకు మోటోరోలా సన్నాహాలు చేస్తుంది. జీ9 ప్లస్‌ ధర సుమారు రూ.31,000గా ఉండనుంది. ఐతే మార్కెట్‌ను బట్టి ఫోన్‌ ధర మారుతుంది.  
 
మోటో జీ9 ప్లస్‌ స్పెసిఫికేషన్లు:
స్టోరేజ్‌:128జీబీ
బ్యాటరీ: 5000mAh
ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 10
డిస్‌ప్లే:6.80 అంగుళాలు
 
ప్రాసెసర్‌: క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 730జీ
ఫ్రంట్‌ కెమెరా:16 మెగా పిక్సల్‌
రియర్‌ కెమెరా: 64+8+2+2 మెగా పిక్సల్‌
ర్యామ్‌: 4జీబీ

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు