ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే.. Motorola Edge 50 Pro స్మార్ట్‌ఫోన్ పర్పుల్, బ్లాక్, సిల్వర్ అనే మూడు రంగులలో వస్తుంది. Motorola Edge 50 Pro స్మార్ట్‌ఫోన్ కొన్ని ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది.
అలాగే ఇది సూపర్ షార్ప్ 1.5K రిజల్యూషన్, సూపర్ స్మూత్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన పెద్ద 6.7-అంగుళాల 3D కర్వ్డ్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే, 2000నిట్‌ల వరకు బ్రైట్‌నెస్, HDR10+కి సపోర్ట్‌తో, వీడియోలు, సినిమాలను చూసే అనుభవం గొప్పగా ఉంటుంది.