ప్యానాసోనిక్ సరికొత్త 4జి స్మార్ట్‌ఫోన్... రూ.6999కే.. ఫీచర్లివే...

సోమవారం, 26 సెప్టెంబరు 2016 (12:25 IST)
ప్యానాసోనిక్ ఖచ్చితంగా ఏ పరిచయం అవసరం లేని ఒక సంస్థ. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ప్యానాసోనిక్, మార్కెట్లోకి సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ''పీ77'' పేరిట ఓ నూత‌న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.6,990 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్స్ వినియోగదారులకు ఈ వారం నుండి అందుబాటులోకి రానుంది.
 
ఇక దీని ఫీచ‌ర్లను ఓ సారి పరిశీలిస్తే....
 
* 5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 X 1280 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* 1 జీహెచ్‌జ‌డ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 1 జీబీ ర్యామ్
* 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై
* 2000 ఎంఏహెచ్ బ్యాట‌రీ 
* 8 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
* 8 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* 2 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.
 

వెబ్దునియా పై చదవండి