Foods to lower cholesterol చెడు కొవ్వు. ఇది ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలకు ఇది ప్రధాన కారణంగా మారుతుంది. అయితే సరైన ఆహారం ద్వారా చెడు కొవ్వును తగ్గించుకోవడం సాధ్యమే. అదెలాగో తెలుసుకుందాము.
ఆపిల్, బొప్పాయి, కివి, నారింజ వంటి పండ్లలోని ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది.
పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరలులోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని శుభ్రపరచి, చెడు కొవ్వును తగ్గించగలవు.
బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా వంటి ధాన్యాలు లోని ఫైబర్ శరీరంలోని శక్తి స్థాయిలను పెంచి, చెడు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.
శనగలు, బీన్స్ వంటి పప్పులు, అలాగే బాదం, వాల్‌నట్స్ వంటి గింజలులోని ప్రోటీన్, ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
సాల్మన్, ట్యూనా వంటి చేపల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచి, చెడు కొవ్వును తగ్గించగలవు.
వేయించిన ఆహారాలు, జంక్ ఫుడ్, రెడ్ మీట్ వంటి అధిక కొవ్వు ఉన్న ఆహారాలను తక్కువగా తీసుకోండి.
ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన నూనెలను వంటకు ఉపయోగించండి.
వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని చెడు కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది.
మంచినీరు తగినంత తాగుతుంటే శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది.