గేమర్స్‌కి క్రేజీ అప్డేట్-చీఫ్ గేమింగ్ ఆఫీసర్ కోసం iQOO పదిలక్షలు!
బుధవారం, 31 మే 2023 (19:43 IST)
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ సంస్థ iQOO చీఫ్ గేమింగ్ ఆఫీసర్ కోసం వెతుకుతోంది. చీఫ్ గేమింగ్ ఆఫీసర్ పాత్ర కోసం రూ. 10 లక్షల జీతం అందిస్తోంది. ఈ ఉద్యోగం 25ఏళ్ల లోపు వయోపరిమితిని కలిగివుండాలి.
ఈ ఉద్యోగం ద్వారా మొబైల్ ఫోన్‌లో అత్యుత్తమ గేమింగ్- ఎస్పోర్ట్స్ అనుభవాన్ని సృష్టించడానికి కంపెనీకి సహాయం చేస్తాడు. తమ అభిరుచిని కెరీర్‌గా మార్చుకునే ఉత్సాహభరితమైన గేమర్‌లకు ఉద్యోగ పాత్ర అందించబడుతోంది.
భారతదేశం నలుమూలల నుండి ప్రతిభావంతులైన గేమర్‌లతో కలిసి పనిచేయడానికి చీఫ్ గేమింగ్ ఆఫీసర్‌కి ఒక ప్రత్యేక అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మరింత ఉత్తేజపరిచేందుకు, iQOO మొదటి CGOకి రూ. 10,00,000 బహుమతిని అందిస్తోంది.