ఈ యాప్ చాలా సురక్షితమైనదని తెలిపారు. ఈ యాప్‌కు సంబంధించిన నియంత్రణను కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందని తెలిపారు. వాట్సాప్‌లో మాదిరిగా నే వన్ టూ వన్ మెసేజింగ్, గ్రూప్ మెసేజింగ్, ఫైల్, మీడియా షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్, ఈ గవర్నమెంట్ అప్లికేషన్ తదితర ఫీచర్లు ఈ యాప్‌లో ఉండనున్నాయి.
కేవలం మొబైల్ నంబర్ తో పాటే కాకుండా ఈమెయిల్ తోనూ ఓపెన్ చేసేలా సందేశ్ యాప్ ను రూపొందించారు. అయితే ఇప్పటివరకు కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సర్కారు ఏజెన్సీలు మాత్రమే వాడుతున్న ఈ యాప్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేసింది.