ప్రింట్ నైట్మేర్గా పిలుస్తున్న ఈ లోపాన్ని హ్యాకర్లు ఉపయోగించుకుని ఇతరుల కంప్యూటర్లలోని డేటాను చూడడం, డిలీట్ చేయడం, కొత్త యూజర్ అకౌంట్లను సృష్టించడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. విండోస్ 10, విండోస్ 7లోనూ ఈ లోపం ఉందని పేర్కొన్న మైక్రోసాఫ్ట్ వీటికోసం అప్‌డేట్‌లను విడుదల చేసింది.
వాస్తవానికి విండోస్ 7 అప్‌డేట్స్‌ను ఆపేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ గతేడాదే ప్రకటించింది. అయితే, తాజా లోపం నేపథ్యంలో దానికి కూడా అప్‌డేట్‌ను విడుదల చేసింది. యూజర్లు అందరూ తప్పకుండా అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా హ్యాకర్ల ముప్పు లేకుండా చూసుకోవాలని కోరింది.