కనకపు సింహాసనం!

గురువారం, 14 ఆగస్టు 2008 (11:25 IST)
కనకపు సింహాసనమున
శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము కట్టిన
వెనుకటి గుణమేల మాను వినురాసుమతీ!

తాత్పర్యం :
కుక్కను బంగారపు సింహాసనం మీద కూర్చోబెట్టి, మంచి ముహూర్తంలో పట్టాభిషేకము చేసినా, దాని సహజమయిన అల్పగుణమును మానదు. ఇలాగే నీచుడైన వానిని ఎంత గౌరవించినా, వాడి నీచగుణాలను వదిలించుకోడని చెబుతున్నాడు సుమతీ శతకకారుడు.

వెబ్దునియా పై చదవండి