వ్యక్తిత్వానికి అద్దం పట్టే సుమతీ శతకం

గురువారం, 31 జనవరి 2008 (13:29 IST)
తెలుగు ప్రజలు నాల్కుల యందు కదలాడే వందలాది శతకాలలో సుమతీ శతకానికి గల ప్రాముఖ్యత విశిష్టమైంది. సుమతీ శతకాన్ని తిక్కన సమకాలికులైన బద్దెన రచించారు. ఇందలి పద్యాలు దైనందిన జీవితంలో పలు సందర్భాలలో తలెత్తే సంఘటనలకు అన్వయించుకోవచ్చు.

అడిగిన జీతంబియ్యని
మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుటకంటెన్
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నుకు బ్రతుకవచ్చు మహిలో సుమతీ !

అడిగినప్పుడు జీతమును ఈయని గర్వియైన ప్రభువును సేవించి జీవించుట కంటె, వేగముగా పోగల యెద్దులను నాగలికి కట్టుకొని పొలమును దున్నుకొని వ్యవసాయముచే జీవించుట మంచిది.

వెబ్దునియా పై చదవండి