అద్వానీకి చెక్ పెట్టారు.. అమిత్ షా‌ను గాంధీనగర్ నుంచి దించారు..

సోమవారం, 25 మార్చి 2019 (13:02 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సీనియర్ నేతలకు ఏమాత్రం గౌరవం ఇవ్వట్లేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. గతంలో బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కె అద్వానీ ఓ కార్యక్రమంలో మోదీని గౌరవించే దిశగా నమస్కరిస్తే.. మోదీ అద్వానీకి ప్రతి నమస్కారం చేయాలనే సంస్కారాన్ని కూడా మరిచిపోయారు. ఆ తర్వాత అదే స్టేజ్‌పై వుండిన మిగిలిన నేతలను గౌరవించారు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది. 
 
తాజాగా ఎన్నికల నేపథ్యంలో తొలి జాబితాలో ఎల్కే అద్వానీకి బీజేపీ అధిష్టానం టికెట్ కేటాయించలేదు. దీంతో బీజేపీ నేతల తీరుతో ఆ పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ తీవ్ర మనస్తాపం చెందినట్టు సన్నిహిత వర్గాల సమాచారం. కాగా రెండు రోజుల క్రితం పార్టీ విడుదల చేసిన లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో అద్వానీ పేరు లేకపోవడం, ఈ విషయం గురించి తనకు మాటమాత్రమైనా చెప్పకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది.
 
నిజానికి తనకు టికెట్ కేటాయించనందుకు అద్వానీ బాధపడడం లేదని, ముఖ్యంగా అద్వానీకి ఎంతో ఇష్టమైన గాంధీనగర్ నియోజకవర్గం నుంచి ఈసారి ఆ పార్టీ చీఫ్ అమిత్ షా బరిలోకి దిగుతున్నారు. 
 
తనకు టికెట్ నిరాకరించిన విషయం కూడా అద్వానీకి తెలియదని సన్నిహితులు వాపోతున్నారు. అంతేకాదు, జాబితా విడుదల చేసిన తర్వాత కూడా బీజేపీ పెద్దలు ఎవరూ అద్వానీతో మాట్లాడలేదట. దీనిపై అద్వానీ సన్నిహితులు మోదీపై గుర్రుగా వున్నారని టాక్ వస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు