అదే ప్రాంతంలో మునులు కూడా ఆశ్రమం ఏర్పరుచుకుని నివసించేవారు. వారిలో ఒకరే విద్వవజిహ్వర్. ఆయనను చూసేందుకు కౌస్తిమతి అనే ఋషి వచ్చారు. విద్వవజిహ్వర్ ఆయనను స్వాగతించి.. అతిథి సత్కారాలు అందించారు. విద్వవజిహ్వర్ యుక్త వయస్సులోనే సన్యాసం స్వీకరించాడు. అయితే ఇది సరికాదని, వివాహం చేసుకోవాలని.. సంతానం పొందాలని లేకుంటే పితరుల శాపానికి కారణం అవుతారని కౌస్తిమతి హితబోధ చేశారు. అందుకే అగస్త్య మహాముని లోపముద్రను వివాహం చేసుకున్నారని పేర్కొన్నారు.
గౌతమ మహర్షి మనవడిని తాను. సదానంద మహర్షికి మనవరాలే వసుమతి. పతీవ్రతా శిరోమణులైన పాంచాలీ, సీత, అరుంధతి, అనసూయలకు సమానురాలు. అయినా విద్వవజిహ్వర్ ఒప్పుకోలేదు. ఇంకా దుర్వాస మహర్షి, కన్వ మహర్షి, మార్కండేయుడు, నారదుల వంటి వారు వివాహం చేసుకోకుండా జీవించలేదా అంటూ ఎదురు ప్రశ్న వేశారు.
దీంతో కౌస్తిమతి తన తపోశక్తితో శ్రీమన్నారాయణుడి అనుగ్రహంతో విద్వవజిహ్వర్ వారు ఎందుకు వివాహం చేసుకోలేదనే ప్రశ్నకు సమాధానమిచ్చాడు. దీంతో భూలోకానికి చేరిన కౌస్తిమతి వసుమతి, విద్వవజిహ్వర్ వివాహాన్ని ఘనం నిర్వహించాడు.