కుమారస్వామి, సూర్యుడు, ఇంద్రుడు, యముడు, అగ్ని, కుబేరుడు.. మహాశివరాత్రి పూజ చేయడంతోనే ఉత్తమ ఫలితాలను పొందారు. అలాగే బ్రహ్మదేవుడు, మహాశివరాత్రి రోజున వ్రతమాచరించి.. శివునిని స్తుతించడం ద్వారా చదువుల తల్లి సరస్వతీ బ్రహ్మకు భార్య అయ్యిందని పురాణాలు చెప్తున్నాయి.
అందుకే శివరాత్రి రోజున చేసే ఉపవాసం, జాగరణకు విశిష్ట ఫలితాలను పొందవచ్చు. జాగరణ ద్వారా తెలిసీ తెలియని చేసిన పాపాలు తొలిగిపోతాయి. పార్వతీదేవికి నవరాత్రులు ప్రసిద్ధి. అదే శివునికి ఒక్క రాత్రే. అదే శివరాత్రి. శివరాత్రి రోజున ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొంటే సర్వసుఖాలు చేకూరుతాయి.
పరమాత్ముడు, శివభగవానుడు.. హాల హలాన్ని మింగినప్పుడు.. స్పృహ తప్పాడు. ఆ సమయంలో శివునిని దేవతలు పూజించిన కాలమే శివరాత్రి అని చెప్పబడుతోంది. శివుడు లేకపోతే ప్రపంచానికి ప్రళయం తప్పదనుకున్న పార్వతీదేవి నాలుగు జాములు పూజలు చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి.