జ్యేష్ఠ పౌర్ణమి.. ఈ పూజలు చేసే వారికి అదృష్టం వరిస్తుందట!

సెల్వి

గురువారం, 20 జూన్ 2024 (22:38 IST)
జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమిని చాలా ముఖ్యమైనది. ఈ పౌర్ణమి రోజున వటసావిత్రి వ్రతం ఆచరిస్తారు. ఈ రోజున పూజలు, నదీస్నానం, శ్రీ సత్యనారాయణ కథ చదవడం, చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం శుభ ఫలితాలను ఇస్తాయి. జ్యేష్ఠ మాస పౌర్ణమి 2024 జూన్ 21, 22 రెండు రోజులు. పూర్ణిమ రెండు రోజులు కాబట్టి మొదటి రోజు పూర్ణిమ వ్రతం ఆచరించి రెండో రోజు పూర్ణిమ నాడు స్నానం చేసి దానం చేస్తే పుణ్యం లభిస్తుంది. 
 
పౌర్ణమి రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ధూపద్రవ్యాలు వెలిగించి హారతి ఇవ్వాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. గోవులకు సేవ చేస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. జ్యేష్ఠ పూర్ణిమ ఉపవాసం అదృష్టం, సంపద, ఆస్తిని ప్రసాదిస్తుంది. వివాహిత స్త్రీలకు ఈ రోజు ప్రత్యేకం. ఈ రోజున సత్యనారాయణ వ్రతం ఆచరించడం సర్వాభీష్ఠాలను చేకూరుస్తుంది. పౌర్ణమి రోజు లక్ష్మీనారాయణులను, రావిచెట్టును పూజిస్తారు. 
 
ఈ రోజున తులసీ పూజ చేయడం ఉత్తమం. ఎవరికైతే జాతకంలో చంద్రదోషముందని జ్యోతిష్యులు తెలిపారో.. అలాంటి వారు జ్యేష్ఠ పౌర్ణమి రోజున చంద్రునికి రవ్వతో చేసిన తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
జ్యేష్ఠ పౌర్ణమిని రోజును ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజున రైతులకు పండుగ. ఈ రోజున ఎద్దులను అందంగా అలంకరించి వాటికి భక్ష్యాలు సమర్పించి మేళతాళాలతో ఊరేగించి  భూమాతకి పూజ చేస్తారు. వ్యవసాయం ప్రారంభించేందుకు జ్యేష్ఠ పౌర్ణమిని ప్రత్యేక ముహూర్తంగా భావిస్తారు రైతులు. వ్యవసాయ పనులు ప్రారంభించేముందు అన్నంపెట్టే భూమాతకి పూజచేస్తారు. అనంతరం దుక్కి దున్ని వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు