20-06-202 గురువారం దినఫలాలు - కపటంలేని మీ ఆలోచనలు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది...

రామన్

గురువారం, 20 జూన్ 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| జ్యేష్ట శు॥ త్రయోదశి ఉ.6.31 అనూరాధ సా.5.38 రా.వ.11.24 ల 1.03. ఉ.దు. 9.48 ల 10.40 ప. దు. 3.00ల 3.52.
 
మేషం :- ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబెల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. దుబారా ఖర్చులు తగ్గించుకోవటం మంచిది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది.
 
వృషభం :- కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. సమావేశానికి ఏర్పట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. పాత వస్తువులను కొని ఇబ్బందులు పడతారు. 
 
మిథునం :- కిరాణా, ఫ్యాన్సీ, కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు శుభదాయకం. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. సమయానుకూలంగా మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలు ప్రతి విషయంలో అతిగా వ్యవహరించడం మంచిదికాదని గ్రహించండి. 
 
కర్కాటకం :- మీ సమస్యలకు ఒక చక్కని పరిష్కార మార్గం లభిస్తుంది. మీ లక్ష్యసాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషి చేయటం వల్ల సత్ఫలితాలు పొందుతారు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. విద్యార్థినులకు టెక్నికల్, సైన్సు, గణిత కోర్సుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
సింహం :- ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించడం మంచిది. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. విద్యార్థులు సన్నిహితుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. చేనేత, ఖాదీ వస్త్ర పరిశ్రమల వారికి ప్రోత్సహకరంగా ఉంటుంది.
 
కన్య :- ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, అందుకుతగిన ప్రోత్సాహం లభిస్తాయి. విద్యార్థులకు క్రీడలు, ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మిత్రుల కారణంగా సమస్యలు తలెత్తగలవు. రుణదాతలను సంతృప్తి పరుస్తారు. మీ పాత సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
తుల :- బంధువుల రాక, ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అధికారులు తీరును గమనించి తదనుగుణంగా వ్యవహరించంటం మంచిది. పారిశ్రామిక రంగంలో వారికి కార్మికులతో చికాకులు తప్పవు. యాదృచ్ఛికంగా పుణ్యక్షేత్ర సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది.
 
వృశ్చికం :- ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మిమ్మల్నిపొగిడే వారే కానీ సహకరించే వారుండరు. వ్యాపారాలు, స్థిరచరాస్తుల అభివృద్ధికై చేయుకృషిలో సఫలీ కృతులౌతారు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఒకే కాలంలో అనేక పనులు చేయడం వలన ఇబ్బందులు తప్పవు.
 
ధనస్సు :- రావలసిన ఆదాయం అందటంతో ఆర్థికంగా ఒకడుగు ముందుకేస్తారు. ఇతరుల గురించి మీరు చేసిన వ్యాఖ్యలు పలు సమస్యలకు దారితీయవచ్చు. కొన్ని వ్యవహరాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. దూరప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు, వ్యపకాలు అధికమవుతాయి.
 
మకరం :- ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. ఎదుటివారిని అతిగా విశ్వసించటం అంత మంచిది కాదని గమనించండి. సంతానం ఉన్నత చదువులపై శ్రద్ధ వహిస్తారు. బంధువుల రాక, అనుకోని ఖర్చుల వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. కాంట్రాక్టర్లకు ఒడిదుడుకులు తప్పవు.
 
కుంభం :- బ్యాంకు వ్యవహారాలలో మెళుకువ అవసరం. ఉద్యోగస్తుల శ్రమకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. మిర్చి, నూనె, వెల్లుల్లి, ధాన్యం, అపరాలు స్టాకిస్టులకు, హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాలపట్ల శ్రద్ధాసక్తులు కనబరుస్తారు.
 
మీనం :- రిప్రజెంటేటివ్‌లకు, ఉపాధ్యాయులకు, మార్పులు అనుకూలిస్తాయి. ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించటం వల్ల ఒక వ్యవహారం మీకు సానుకూలమవుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుండి అవకాశాలు లభిస్తాయి. స్త్రీలు విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తుల వారికి పురోభివృద్ధి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు