కరివేపాకులో ఎన్ని ఔషధగుణాలున్నాయో మీకు తెలుసా!?

శుక్రవారం, 25 మే 2012 (17:52 IST)
FILE
భోజనం చేసే సమయంలో కూరల్లో కరివేపాకు కనిపిస్తే చాలు... తీసి పక్కనబెట్టేస్తుంటాం. మీరిలా చేస్తున్నారంటే.. తప్పకుండా ఈ కథనం చదవాల్సిందే. కూరల్లో కరివేపాకు పక్కనబెట్టడం ఇకపై చేయకండి. కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయని తాజా అధ్యయనంలో తేలింది.

భారతీయ వంటకాల్లో కరివేపాకు వాడటం పరిపాటి. అయితే ప్రస్తుతం ఆసియా దేశాల్లో కరివేపాకు వాడకం పెరిగిపోతోంది. ఇందుకు కారణం కరివేపాకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలే.

- కరివేపాకును తినడం ద్వారా కేశాలు మృదువు అవుతాయి.
- చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం పోవడాన్ని నివారిస్తుంది.
- మహిళలు గర్భం ధరించినపుడు కరివేపాకు పొడిని అన్నంలో గానీ, నిమ్మరసం లేదా జ్యూస్‌లో గానీ అర స్పూన్ వేసుకుని తాగితే వాంతులను నిరోధిస్తుంది. ఇంకేముంది..? ఇక కూరల్లో కరివేపాకు కనిపిస్తే అలాగే నమిలి మింగేస్తారు.. కదూ.

వెబ్దునియా పై చదవండి