హంసవాహనుడైన శ్రీ చక్రధారి

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం రాత్రి హంసవాహన, సరస్వతి దేవీ రూపంలో నాలుగు మాడవీధుల్లో స్వామివారిని ఊరేగించారు. అలంకృతులైన మలయప్ప స్వామిని వారిని ఊరేగింపుగా ఊంజల్ మండపం నుంచి వాహన మండపం వద్దకు చేర్చి సమర్పణ పూర్తయిన వెంటనే స్వామి వారి హంస వాహన సేవ కొనసాగింది.

మానవునిలో దాగి ఉన్న అజ్ఞాతాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ప్రభోదించే విధంగా జరిగిన స్వామి వారి ఊరేగింపు భక్తులను పెద్దఎత్తున ఆకట్టుకుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం తొమ్మిది నుంచి 11 గంటలకు మధ్యలో స్వామివారి సింహవాహన సేవ, మధ్యాహ్నం రెండుగంటలకు స్నపన తిరుమంజన వేడుక, రాత్రి తొమ్మిది నుంచి 11 గంటల వరకు ముత్యపు పందిరి వాహన సేవలు జరుగనున్నాయని తితిదే ప్రకటనలో తెలిపింది.

వెబ్దునియా పై చదవండి