ఎవరెస్ట్ అధిరోహణ: చరిత్ర సృష్టించిన భారతీయులు

ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని ఒక్క రోజులోనే అధిరోహించి 11 మంది భారతీయుల బృందం చరిత్ర సృష్టించింది. 19 ఏళ్ల యువతి, మరో మహిళతోపాటు 11 మంది భారతీయులు గురువారం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఇదే రోజు నేపాలీయుడొకరు కూడా 19వసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు నెలకొల్పాడు.

ఉత్తరకాశికి చెందిన నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ (ఎన్ఐఎం) ప్రిన్సిపాల్ కల్నల్ మంగల్ మూర్తీ మసూర్ నేతృత్వంలోని పది మంది సభ్యుల బృందం గురువారం ఉదయం 8848 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ పర్వత శిఖరాన్ని చేరుకున్నారు. రెండు గ్రూపులకు విడిపోయిన ఈ పది మంది సభ్యుల బృందం 0500, 0600 గంటలకు పర్వత శిఖరాన్ని చేరుకున్నారని ఎన్ఐఎం ప్రతినిధులు చెప్పారు.

మహారాష్ట్రకు చెందిన కృష్ణా పాటిల్ (19) అనే బాలిక కూడా నేపాల్ నుంచి బయలుదేరిన ఏషియన్ ట్రెక్కింగ్ బృందంతో కలిసి ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించింది. ఈ ఘనత సాధించిన తొలి మరాఠీ ఈమె. పాటిల్ గురువారం ఉదయం 0700 గంటల సమయంలో ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నట్లు ఆమె తల్లి రంజనా పాటిల్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి