శుక్రవారం రాత్రి పాపతో సహా తల్లిదండ్రులు ఇంటి బయట నిద్రిస్తున్నారు. అర్థరాత్రి సమయంలో నిద్రలేచిన తల్లికి పాప కనిపించలేదు. పాప ఏమైపోయిందోనన్న ఆందోళనలో తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారు చుట్టుపక్కల వెతికారు. ఓ నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ దగ్గర్లో పాప ఏడుపు వినిపించింది.
అక్కడకు వెళ్లిన తల్లిదండ్రులకు దారుణమైన దృశ్యం కనిపించింది. పాపతో లైంగిక వాంఛ తీర్చుకుంటున్న ఆ దుర్మార్గుడిని చితక్కొట్టారు. పాపను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీలోని వికాస్‌పురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఢిల్లీ వెస్ట్ విశాఖపురి ఏరియాలో జరిగింది.