ఢిల్లీలోని చాందనీచౌక్ ప్రాంతంలోని భగీరథ్ ప్యాలెస్ మార్కెట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం మంటలను ఇంకా అర్పి వేస్తున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు 200కి పైగా దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత ఘటనాస్థలికి చేరుకున్న 14 అగ్నిమాపకదళ యంత్రాలు మంటలను ఆర్పివేసేందుకు గత మూడు రోజులుగా శ్రమిస్తూనే ఉన్నాయి.
అయితే, ఈ మంటల్లో మార్కెట్‌లోని 200 షాపులు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదానికి సంబధించి ఎలక్ట్రానికి ఉపకరణాలకు సంబంధించిన ఐపీసీ 285, ఐపీసీ 336 కింద కేసును నమోదుచేసినట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
మరోవైపు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శనివారం భగీరథ్ ప్యాలెస్‌ను సందర్శించారు. వేలాడే విద్యుత్ తీగలు, ఓవర్ లోడ్ సర్క్యూట్‌లు, పాత భవనాలు, నీటి కొరత, ఇరుకైన లేన్లు, అటువంటి ప్రాంతాల మంటలకు ప్రమాదకరంగా ఉంటాయని ఆయన ట్వీట్ చేశారు.